Breaking: ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ నటుడు రాకేశ్ పాండే (77) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో జుహూలోని ఓ ఆస్పత్రిలో ఆయన మృతిచెందారు. థియేటర్ ఆర్టిస్టుగా విశేష అనుభవం గల ఆయన 1969లో బసు ఛటర్జీ తీసిన క్లాసిక్ ‘సారా ఆకాశ్ 'తో తెరంగేట్రం చేశారు. తన నటనతో మెప్పించి ప్రెసిడెంట్ అవార్డునూ పొందారు.
సినిమాలే కాకుండా ఆయన ఛోటీ బాహు, దెప్లీజ్, భారత్ ఏక్ ఖోజ్ వంటి TV షోల్లోనూ నటించారు. రియాల్టీకి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకోవడంలో ఆయన దిట్ట అనే పేరు ఉంది.