వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను ఎస్సీ, ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది. దర్యాప్తు అధికారిని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనను విజయవాడ సీఐడీ కోర్టు మూడు రోజుల సీఐడీ కస్టడీకి ఇస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.