గ్రీన్ కార్డు ఉన్నా అమెరికాలో ఉండలేరు
అంతా భావిస్తున్నట్టు అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు శాశ్వత నివాసులు కారని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు గ్రీన్ కార్డు హోల్డరుకు లేదని, ఇది ఫ్రీ స్పీచ్ గురించి కాదని, జాతీయ భద్రతకు సంబంధించినదని తెలిపారు.
"మన నేషనల్ కమ్యూనిటీలో ఎవరు చేరాలన్నది నిర్ణయించేది అమెరికన్లుగా మనమే" అని వ్యాఖ్యలు చేశారు. నేరాలు, సుదీర్ఘకాలం దేశంలో లేకుంటే, వలస నిబంధనలు పాటించకుంటే గ్రీన్ రద్దు చేసేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే.