ట్రంప్ దూకుడుకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్
టారీఫ్ లతో అన్ని దేశాల మీద ఆధిక్యాన్ని సంపాదిద్దామనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు యూఎస్ ఫెడరల్ కోర్టు షాకిచ్చింది. సుంకాలను అమలు చేయకూడదని ఆర్డర్లు పాస్ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని అభ్యర్థనలను చేసినా న్యాయస్థానం ఒప్పుకోలేదు.