కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో BSF 24, CRPF 204, CISF 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలకు భర్తీ చేయనున్నారు.
డిగ్రీ పూర్తి చేసి ఉండి 20 నుండి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25గా ప్రకటించారు. upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.