UPI సర్వర్లు డౌన్.. తప్పని ఇబ్బందులు
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ అన్నీ UPI లోనే చేస్తున్నారు. అలాంటి UPI ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. బుధవారం సాయంత్రం నుండి దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి.
యూపీఐ సర్వర్ డౌన్ అయ్యింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావడం లేదని, బ్యాలెన్స్ చెక్ చేసుకొందామన్నా సాధ్యం కావడం లేదని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. అన్ఏబుల్ టు లోడ్ అకౌంట్ అనే మెసేజ్ వస్తోందంటూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లు వాపోతున్నారు.