ట్రంప్ కు కేంద్ర మంత్రి జైశంకర్ కౌంటర్
భారత్-పాక్ వార్ అంశంలో ట్రంప్కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండో -పాక్ చర్చల్లో మూడో వారి జోక్యం అవసరం లేదన్నారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిస్టుల గురించే మాట్లాడుతుందని, పాక్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని హెచ్చరించారు. సింధూ జలాల నుంచి చుక్క నీరు పాక్కు ఇవ్వమని, కాల్పుల విరమణ పాకిస్తానే కోరుకుంటుంది తప్పా భారత్ కాదని చెప్పారు.