నేడు ఆర్జిత సేవ టికెట్లు విడుదల

News Published On : Tuesday, March 18, 2025 07:40 AM

శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

లక్కీ డిప్ టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20 నుండి 22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీటీడీపీ వెల్లడించింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనున్నారు.