నేడు దర్శన టిక్కెట్లు విడుదల

News Published On : Friday, May 23, 2025 07:27 AM

తిరుమలలో నేడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కాగా ఉదయం 11 గంటలకు శ్రీవారి దర్శన టికెట్ల విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయగా రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.