భారత్, పాక్ దాడులపై స్పందించిన ట్రంప్
భారత్, పాక్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దాడులను ఆపేయాలని తెలిపారు. ఇరుదేశాలు విభేదాలు పరిష్కరించుకోవడానికి సహకరిస్తానని ఉద్రిక్తతలు ఆగిపోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. సహాయం చేసేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.