21,413 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ..
పోస్టల్ డిపార్ట్మెంట్ 21,413 పోస్టుల భర్తీ కోసం గత నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. బ్రాంచ్ పోస్ట్మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ పోస్టులకు ఈ నెల 3లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీలో 1,215 పోస్టులు, తెలంగాణలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. రాత పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్లో అప్లై చేసుకోవచ్చు.