కలియుగ వైకుంఠం తిరుమలను కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్పు..!

News Published On : Sunday, March 29, 2020 09:00 AM

కరోనా వైరస్‌ను మట్టుబెట్టడానికి భారత్ సహా ప్రపంచదేశాలు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. ఎవరు, ఎన్ని రకాలుగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నా ఈ వైరస్ తీవ్రత మాత్రం తగ్గట్లేదు. అంతకు మించి మరింత విజృంభిస్తోంది కూడా. అడ్డు, అదుపు లేకుండా చెలరేగిపోయి వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. లక్షలాది మంది ప్రజల శరీరాల్లో తిష్టవేసుకుని కూర్చుంది.ఒక్క మన రాష్ట్రంలోనే 27 వేల మందికి పైగా స్థానికులు విదేశాల నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది.

ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చ ప్రారంభమైంది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కలియుగ వైకుంఠంలా ఆరాధిస్తోన్న తిరుమలను కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. దీన్ని లేవనెత్తిన వారిలో ప్రముఖులు కూడా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తిరుమలను ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నారు.