శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతోందంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 23,105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
బుధవారం ఒక్క రోజులో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు సమకూరింది. తిరుమలకు వెళ్ళే భక్తులు దర్శన సమయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.