భారీ పేలుడు.. ముగ్గురు పోలీసులు మృతి

News Published On : Thursday, May 8, 2025 09:49 AM

తెలంగాణలో ములుగు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాజేడులో మందు పాతర పేలింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు మందు పాతర పేల్చారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.