వారికి రుణమాఫీ చేయం.. స్పష్టం చేసిన మంత్రి
తెలంగాణలో రూ.2 లక్షలకుపైగా అప్పు ఉన్నవారికి రుణమాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 5 ఎకరాలలోపు ఉన్నవారికి రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో చెప్పారు. వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు.
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తున్నమని ఆయన ఉద్ఘాటించారు.