ప్రధాని మోడీని, భారత్ ను అంతం చేస్తా: జైషే చీఫ్ మసూద్ అజార్

News Published On : Wednesday, May 7, 2025 07:05 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట భీకర దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. భారత్ జరిపిన ఈ దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ కుటుంబం హతం అయింది. మసూద్ కు చెందిన బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. మసూద్ ఫ్యామిలీలో మొత్తం 14 మంది హతం అయినట్లు ఆయనే వెల్లడించాడు. మరో నలుగురు ఆయన అనుచరులు కూడా మృతి చెందారు.

'ఆపరేషన్ సిందూర్' దాడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ఖండించాడు. భారత్ పై విషం కక్కాడు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధం నియమాలను ఉల్లంఘించారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం, నిరాశ లేదన్నాడు. భయం, విచారం కూడా లేదని తెలిపాడు. ఈ మేరకు ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తానని మసూద్ అజహర్ హెచ్చరించాడు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక వేస్తానని తెలిపాడు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశాడు. ఇక బహావల్ పూర్ లో మసూద్ అజహర్ కుటుంబంపై జరిపిన దాడిలో ఆయన అక్క, బావ, కోడలు, మసూద్ భార్య, ఐదుగురు పిల్లలు, మరో నలుగురు అనుచరులు హతం అయ్యారు. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. గతంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఆయన హస్తం ఉంది. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పథాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి.. తదితర దాడుల్లో ఆయన హస్తం ఉంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...