Breaking: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై కాల్పులు జరిపారు.
వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. దీంతో ఉగ్రవాదులు పారిపోయారు. పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.