సత్యసాయి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రేపటి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో విప్ జారీకి వైసీపీ నేతలు వెళ్లారు. అయితే ఇరు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 144 సెక్షన్ను అమలు చేశారు. మరోవైపు రామగిరికి బయల్దేరిన వైసిపి ఇన్చార్జి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.