Breaking: హైదరాబాద్ లో ఉద్రిక్తత
హైదరాబాద్ వనస్థలిపురం కమ్మగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. దాడిలో భాగంగా ప్లాట్ ఓనర్లు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి పలు బైక్ లకు నిప్పు అంటించారు. కమ్మగూడ సర్వే నంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదం చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఓనర్స్, పట్టదారులకు మధ్య భూవివాదం కొనసాగుతుంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.