హైడ్రా టార్గెట్ పేదలేనా: తెలంగాణ హైకోర్టు
మరోసారి హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని అడిగింది. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని హైకోర్టు పేర్కొంది.