పంచాయితీ ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం

త్వరలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో నిర్వహిస్తే సిబ్బంది కొరత ఉండదని అధికారులు చెబుతుండగా, అలా చేస్తే సమయం వృథా అవుతుందని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.
అవసరమైతే ఇతర శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో జరిగే క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.