త్వరలోనే 55,418 ఉద్యోగాల భర్తీ..!
తెలంగాణలో కొలువుల జాతర మొదలుకానుంది. త్వరలోనే 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంగన్వాడీ, గ్రామ పరిపాలన అధికారులతో పాటు హోం, వైద్యారోగ్య, విద్యా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖతో చర్చలు జరిపిన తర్వాత వీటిపై నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే 58,868 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.