Breaking: టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్
అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ ఇంచార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆలూరు కోర్టులో హాజరుపరచగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయననను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. సాంకేతిక ఆధారాలను పరిశీలించాకే నారాయణను అరెస్ట్ చేశామని, త్వరలోనే మరికొందరిని అదుపులోకి తీసుకుంటామని ASP హుసేన్ పీరా తెలిపారు.