డ్రైవింగ్ రాకుండానే జేసీబీని డ్రైవ్ చేసిన బాలుడు
తమిళనాడులో మధురై నగరంలోని సెల్లూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు JCB ఎక్స్‌కవేటర్‌ను నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. ఆ బాలుడు డ్రైవింగ్ రాకుండానే JCB ఎక్స్‌కవేటర్‌ను నడపి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొట్టాడని, భవనంలోని ఒక భాగం మరియు కొన్ని సైన్‌బోర్డులు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు.
బాలుడు అరగంట పాటు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారని, కొంతమంది యువకులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని స్థానికులు తెలిపారు. సెల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి అతని హింసాత్మక చర్య వెనుక గల ఉద్దేశ్యాన్ని దర్యాప్తు చేస్తున్నారు, బాలుడు మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నాడా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.