పెళ్లి చేసుకోకుంటే ఉద్యోగాలు తీసేస్తాం
బాగా పనిచేయకపోతే ఉద్యోగం ఊస్టింగే అని కంపెనీలు వార్నింగ్ ఇవ్వడం సహజం. అయితే చైనాలో 'షానాంగ్' అనే సంస్థ తమ ఒంటరి సిబ్బందిని సెప్టెంబర్ నాటికి పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. లేదంటే జాబ్ వదులుకోవాల్సిందేనని హెచ్చరించింది.
దీనిపై ప్రభుత్వం అధికారులు మందలించారు. అయినా ఆ కంపెనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాన్ని సమర్థించుకుంది. దేశంలో వివాహ రేటును పెంచడానికే ఇలా చేశామంది. కాగా చైనాలో వివాహ, జనన రేటు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.