అమెరికాలో చదవాలనుకునే వారికి షాక్..!
అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు షాక్ తగలనుంది. అమెరికా అడ్మినిస్ట్రేషన్ రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను తిరస్కరిస్తోంది. తాజాగా ఈ రిజెక్షన్ రేటు 40 శాతానికి చేరడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.79 లక్షల దరఖాస్తులు రాగా అందులో 2.79 లక్షల వీసాలను తిరస్కరించినట్టు తెలిసింది.
అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాల్లో 90 శాతం వరకు F1 వీసాలు ఉంటాయి. 2023లో లక్ష మందికి F1 వీసాలు రాగా 2024 జనవరి నుండి సెప్టెంబర్ కాలంలో వాటి సంఖ్య 64,008కి తగ్గిపోయింది.