వివేకా హత్యకేసు: అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంపు
జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు పెంచి గన్మెన్లను కేటాయించారు. ఈ విషయాన్ని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.
వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన దస్తగిరి విన్నవించారు. దీంతో ఆయనకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.