ఎంపీలకు భారీగా జీతాలు పెంచిన కేంద్రం
దేశంలో ఎంపీలకు జీతాలు భారీగా పెరిగాయి. ఎంపీలకు జీతాలతో పాటు అలవెన్స్, పెన్షన్ కూడా పెంచారు. మాజీ ఎంపీలకు అడిషనల్ అలవెన్స్ కూడా పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. ఎంపీ జీతం రూ.లక్ష నుంచి రూ.లక్షా 24 వేలకు పెంచారు. ఎంపీల రోజువారీ రూ.2 వేల అలవెన్స్ రూ.2,500కు, మాజీ ఎంపీల పెన్షన్ రూ.25 వేల నుంచి రూ.31 వేలకు పెంచారు.