బికినీలో కరోనా రోగులకు చికిత్స, వైరల్ ఫోటో, ఎక్కడో తెలుసా?

News Published On : Saturday, May 23, 2020 07:28 AM

కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రపంచంలో ప్రతి దేశానికీ కూడా కరోనా వైరస్ అంటుకుంది. రష్యాలో రోజు రోజుకు వైరస్ వేగంగా విస్తరిస్తుది ప్రస్తుతం రష్యాలో కేసులు పెరుగుతున్నాయి. రష్యా లో ఇప్పటి వరకు 3,10,705 మంది కరోనా బారిన పడగా, 2,972 మంది మరణించారు.  

మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా రోగులకు వైద్యులు, నర్సులు నిత్యం సేవలు అందిస్తూనే ఉన్నారు. కరోనా రోగులకు సేవలు అందించే వైద్యులు, నర్సులు తప్పనిసరిగా పీపీఈ షీల్డ్స్ మరియు మాస్క్ ధరించాలి. పీపీఈ ప్లాస్టిక్ తో తయారు చేసి ఉంటుంది వాటిని ధరిస్తే శరీరంలోపల వేడి అధికంగా ఉంటుంది కానీ వైద్యం చేసేటప్పుఫు తప్పదు.  

అయితే, రష్యాలోని టూలా పట్టణంలో కోవిడ్ హాస్పిటల్ లో పనిచేస్తున్న మహిళ నర్స్ బికినీ, దానిపైన పీపీఈ ధరించి సేవలు అందిస్తోంది. లోపల మాములు దుస్తులు ధరించి, దానిపై పీపీఈ వేసుకుంటే ఉక్కపోత పోస్తుందని అందుకే బికినీ వేసుకొని దానిపై పీపీఈ ధరించినట్టు ఆమె చెప్తున్నది. రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని అంటోంది. అయితే, దీనిపై ప్రభుత్వం మాత్రంమండిపడింది. విచారణకు ఆదేశించింది