పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లెవల్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 32,438 పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి.
CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేపడతారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ పరీక్ష రాయొచ్చు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. https://www.rrbapply.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.