కుళ్లిన మాంసంతో హలీమ్..
హైదరాబాద్ లో షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పలు హోటళ్లలో కుళ్లిన మాంసం ప్రజలను కలవరపెడుతోంది. ఇటీవల మంగళ్ హాట్ లో అధికారులు 12 టన్నుల మేక మాంసాన్ని సీజ్ చేశారు. ఈ రోజు డబీర్ పురలో 2 టన్నుల మటన్ ను గుర్తించారు.
పాడైన మేక, గొర్రె మాంసాన్ని వివాహాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు మిస్సాహుద్దీనన్ను అరెస్ట్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో మటన్, హలీం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన మాంసం సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు.