Breaking: రాష్ట్రంలో రెడ్ అలర్ట్
దేశ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. జైసల్మేర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికే అక్కడి ప్రజలను ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితి మినహాయించి బయటకు రావద్దని తెలిపారు.