బ్యాంకు ఈఎంఐల పైన ఆర్బీఐ కీలక ప్రకటన

News Published On : Friday, March 27, 2020 12:41 PM

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకు ఈఎంఐలు 3 నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అన్ని రకాల బ్యాంకుల నెల వాయిదాలపై ఆర్బీఐ మారిటోయం విధించింది. ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. అంటే మారిటోరియం కాలంలో మీ వేతనం నుంచి ఈఎంఐ పేరిట నెలసరి వాయిదా కట్ కాదు. ఇలా మూడు నెలల పాటు మీరు వాయిదా కట్ అవ్వని డబ్బుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఆ మొత్తం వినియోగ దారులకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా 3 నెలల మారిటోరియం అనంతరం తిరిగి ఈఎంఐ మొత్తాన్ని బ్యాంకులు వసూలు చేసుకోవచ్చు.

గృహ, వాహన, పర్సనల్ లోన్స్ తీసుకునే వినియోగ దారులకు ఆర్బీఐ ప్రకటన వరమనే చెప్పాలి. నెల ప్రారంభంలోనే వేతనం పడగానే ఈఎంఐ రూపేణా బ్యాంకులు వారి వేతనాన్ని వాయిదాల్లో ఆటోమేటిగ్గా జమచేసేసుకుంటాయి. ఈ ఊరటతో వినియోగదారులకు మూడు నెలల పాటు ఈఎంఐ డబ్బు సేవ్ అవుతుందనే చెప్పాలి.