హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం
హైదరాబాద్ మెట్రోకు మరో అరుదైన గుర్తింపు లభించింది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే జర్నల్ లో మెట్రోను గురించిన విశేషాలను ప్రచురించింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన నాటినుంచి ఎదుర్కొన్న సవాళ్లు, ఆటంకాలు ఇలా ప్రతి అంశాన్ని ఈ పరిశోధనలో వెల్లడించారు.