నేడు వారి ఖాతాలో రూ.12 వేలు జమ

News Published On : Monday, February 10, 2025 11:00 AM

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం రెండో విడతగా అర్హులైన రైతుల అకౌంట్లలో ఈ రోజు డబ్బు జమ చేయనుంది. ఇటీవల 1 ఎకరం ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఇక ఇవాళ 2 ఎకరాల లోపు భూమి ఉండి, సాగు చెయ్యడానికి అనుకూలంగా ఉంటే వారి అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది. ఎకరానికి రూ.6,000 చొప్పున ఒక్కో రైతు అకౌంట్‌లో మొత్తం రూ.12,000 జమ చేయనుంది.

మొత్తం 1 కోటి 50 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ కానున్నాయి. ఒకేసారి భారీగా డబ్బు ఇవ్వడం కుదరకపోవడంతో ప్రభుత్వం విడతల వారీగా ఇస్తోంది. గత బుధవారం 1 ఎకరం ఉన్న మొత్తం 17.03 లక్షల మంది రైతులకు రూ.6,000 చొప్పున ఇచ్చింది. ఇలా మొత్తం రూ.533 కోట్లు జమ చేసింది.