రైల్వే కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు
దేశంలోని స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రైల్వే పోటీని ప్రకటించింది. “ప్రొఫెషనల్స్, కళాశాల/ విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)” మూడు విభాగాలుగా చేసి గడియారాలను డిజైన్ చేయమని కోరింది. డిజైన్లను ఈ నెల 31 లోపు contest.pr@rb.railnet .gov.in లో సబ్మిట్ చేయాలి. విజేతకు రూ.5 లక్షలు ఇవ్వనుంది. మూడు విభాగాలలో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులుగా రూ.5000 చొప్పున ఇవ్వనుంది.