BREAKING: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధాని మోడీ ఈ రోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏం మాట్లాడనున్నారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉండగా.. భారత్-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా భారత్ 3 కీలక డిమాండ్లు పెట్టనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సాయం నిలిపివేయాలి, మసూద్ అజార్,హఫీజ్, దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగించాలి. అలాగే POKను కూడా అప్పగించాలనే డిమాండ్లు భారత్ చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.