సింధు జలాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. భారత్ కు ఉద్దేశించిన జలాలు ఇక్కడే ఉంటాయని,వాటిని దేశ ప్రయోజనాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇదివరకు భారత్ కు దక్కాల్సిన నీటి వాటా కూడా బయటకు వెళ్లిపోయేది. కానీ, ఇప్పుడు భారత జలాలు ఇక్కడే ప్రవహిస్తూ, నిలుస్తున్నాయి. మన దేశ జలాలు.. మన హక్కు అని తెలిపారు.