తమిళనాడు ప్రభుత్వానికి షాక్..నీట్ మినహాయింపు బిల్లు తిరస్కరణ
తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలన్న బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. NEETను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ గతేడాది జూన్ లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.