2 రోజుల్లో బెయిల్ రాకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా: పోసాని
గుంటూరు కోర్టులో ప్రముఖు నటుడు పోసాని కృష్ణ మురళి తరపున వాదనలు ముగిశాయి. బుధవారం గుంటూరు జడ్జి సమక్షంలో పోసాని కృష్ణ మురళి కన్నీరు పెట్టుకున్నారు. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని వాపోయారు.
కోర్టులో జడ్జి ముందు పోసాని మాట్లాడుతూ.. "తప్పు చేస్తే నరికేయండి. కానీ, ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. రెండు ఆపరేషన్లు అయ్యాయి. స్టంట్లు కూడా వేశారు. 70 ఏళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారు.. కేవలం వ్యక్తిగత కక్ష్యలతోనే తనపై తప్పుడు కేసులు పెట్టారు." అని చెప్పుకుంటూ పోసాని కన్నీరుమున్నీరయ్యారు.