సచిన్, కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేస్తున్నారంటూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, భారత క్రికెటర్లు సచిన్, విరాట్ కోహ్లిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై సామాజిక బాధ్యతతో కంప్లెంట్ ఇచ్చానని తెలిపారు.
బతుకు తెరువు కోసం యూట్యూబ్ ఛానల్స్ నడిపే యూట్యూబర్లనే అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు తప్ప పెద్ద సెలబ్రిటీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.