తాడిపత్రిలో టెన్షన్: 17 మందిపై కేసు నమోదు
తాడిపత్రిలో ఏర్పడిన ఘర్షణకు సంబంధించి పోలీసులు 17 మందిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఇటీవల ఘర్షణ నెలకొంది. మున్సిపల్ స్థలంలో ఆయన నిర్మాణం చేపట్టారంటూ అధికారులు జేసీబీతో వచ్చారు. విషయం తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.
ఇదే క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాళ్ల దాడి జరిగింది. గాయపడ్డ వరుణ్ ఫిర్యాదు మేరకు వైసీపీ నేత ఫయాజ్ బాషాతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.