నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ
నేడు ఏపీలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ఓ ప్రకటనలో కోరింది.