పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్.. కేసు నమోదు
కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవిత్ర స్నానం చేసిన విషయం తెలిసిందే. ఆయన స్నానం చేసిన సమయంలోని ఫోటోలు మార్ఫింగ్ చేసి ‘జగనన్న సైన్యం' పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తిరుపతి వెస్ట్, చిత్తూరు పోలీసు స్టేషన్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
పవన్ పొట్ట కనిపించేలా అభ్యంతరకరమైన ఫోటోలు పెడుతున్నారని జనసేన కార్యకర్తలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.