వీర జవాన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ భారీ ఆర్థికసాయం
భారత్, పాక్ ల మధ్య చోటుచేసుకున్న కాల్పులలో జవాన్ మురళీ నాయక్ మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. అమరుడైన మురళీ నాయక్ భౌతిక కాయానికి పవన్ నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.