Breaking: కాళ్ళబేరానికి వచ్చిన పాక్.. భారత్‌కు లేఖ!
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ దాయాది దేశానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లే నీటిని భారత్ నిలిపి వేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌లో నీటి ఎద్దడి నెలకొంది నెలకొంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో యుద్ధవాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఆమెరికా జోక్యం చేసుకొని చర్చలు జరపడంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన వేళ సింధూ జలాల ఒప్పందంపై భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. రెండు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయడంలో తమ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్టు పాకిస్తాన్ లేఖలో ప్రస్తావించింది. సింధూ జలాల ఒప్పందంపై మరోసారి పునఃసమీక్షించాలని భారత్‌కు రాసిన లేఖలో పాకిస్తాన్ పేర్కొంది.