భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసి వందల డ్రోన్లతో పాక్ దాడి
నిన్న రాత్రి జరిగిన దాడిలో భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్లు కల్నర్ సోషియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. భారత గగనతలంలోకి పాకిస్తాన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు వచ్చాయని, 300-400 డ్రోన్లలో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఎల్ఓసీ వెంబడి పాక్ దాడులకు తెగబడిందని, ప్రతీకార కాల్పుల్లో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయినట్లు ప్రకటించారు.
పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణగా వాడుకుని దాడులకు దిగినట్లు ఆధారాలతో సహా భారత్ ప్రపంచం ముందుంచింది. దాడికి ముందు తన ఎయిర్‌స్పేస్ కూడా మూసేయని విషయాలను తెలిపారు. పాకిస్తాన్ మొత్తం 36 చోట్ల దాడులకు ప్రయత్నించినట్లు తెలిపింది. భారత నగరాలు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. ప్రతీదాడుల విషయంలో భారత్ సంయమనం పాటించిందని, పౌర విమానాల్లో ప్రయాణిస్తు్న్న విదేశీ ప్రయాణికులకు ఎలాంటి ఆపద కలగకుండా చూసుకుందని సైనికాధికారులు చెప్పారు. దాడి చేసిన డ్రోన్లు టర్కీకి చెందిన అసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్లుగా వాటిగా ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు.