Breaking: మరోసారి భారత్ పై పాకిస్థాన్ దాడి
పాకిస్థాన్ తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. ఓ వైపు భారత్ తో కాల్పుల ఒప్పందంపై కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్థాన్ తాజాగా మరోసారి భారత్ పై డ్రోన్ దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో డ్రోన్ లు దూసుకురావడంతో భారత రక్షణ వ్యవస్థ వెంటనే అప్రమత్తమై డ్రోన్స్ ను కూల్చివేసింది. దీంతో సాంబా సెక్టార్ లో అధికారులు పూర్తిగా బ్లాక్ ఔట్ విధించారు.