పహల్గాం ఉగ్రదాడి.. చిక్కిన అనుమానితులు?
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారనే దానిపై ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక రాజధాని కోలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే శ్రీలంక ఎయిర్లైన్స్ కు చెందిన యూఎల్ 122 విమానంలో చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులు పట్టుబడ్డారు. ఆ విమానం చెన్నై నుండి కొలంబో వెళ్ళింది.