ఒక దేశం ఒకే మద్యం ధరలు... తెరపైకి కొత్త డిమాండ్
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ ఓ ఐఆర్ఎఎస్ అధికారి ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్టు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓకే సారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయానికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటులో వన్-నేషన్ వన్-ఎలక్షన్ అనే బిల్లును తీసుకొచ్చేందుకు సిద్దమైంది.
అయితే మందు బాబులు ఇదే లాజిక్ తీసుకుని వన్-నేషన్ వన్ రేట్ అంటున్నారని ఓ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గోవాలో రూ.320 లు ఉన్న వైన్ బాటిల్ ధర కర్ణాటకలో రూ.920 లుగా ఉంది. మద్యం ప్రియుల నుంచి ఇటువంటి డిమాండ్ వస్తోంది. దయచేసి దీని గురించి కూడా ఆలోచించండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.